The ten days of Dussehra festival will begin on September 29, and the celebrations will continue till October 8 (Dussehra day) at Vijayawada Durga temple. In this context, The temple EO Suresh Babu conducted a meeting with the officials over the arrangements.
#Vijayawada
#DurgaTemple
#DussehraFestival
#Andraprdesh
#apcmjagan
#ysrcp
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ యేడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 29న మొదలై అక్టోబర్ 8న దసరా పండుగ రోజు వరకూ కొనసాగనున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో 8లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనావేశారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్టాల్ర నుంచి భక్తులు ప్రతి ఏటా అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు.